Riteish Deshmukh | మరాఠీ చిత్ర పరిశ్రమలో భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చారిత్రక చిత్రం ‘రాజా శివాజీ’ ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. థియేటర్లలో రూ.110 కోట్లకు పైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజు నుంచి (జూన్ 26) ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో మరాఠీ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
మరాఠీ, బాలీవుడ్ స్టార్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించడమే కాకుండా, ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. రితేష్ భార్య జెనీలియా దేశ్‌ముఖ్ సాయిబాయి పాత్రలో కనిపించడంతో పాటు ఈ సినిమాను నిర్మించారు. వీరితో పాటు సంజయ్ దత్ అఫ్జల్ ఖాన్‌గా, అభిషేక్ బచ్చన్ సంభాజీ భోసలేగా, విద్యాబాలన్, ఫర్దీన్ ఖాన్ వంటి స్టార్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశారు. గ్రాండ్ విజువల్స్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్‌లతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేస్తోంది.