Manoj Bajpayee | ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ (Last Man In Tower). ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బెన్ రెఖి (Ben Rekhi) దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రముఖ టాలీవుడ్ హీరో, నిర్మాత రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా (Spirit Media) సంస్థ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతుండటం విశేషం.
ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయితో పాటు బోమన్ ఇరానీ, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రత్యేకించి, మనోజ్ బాజ్‌పేయి మరియు బోమన్ ఇరానీ ఇద్దరూ కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బుకర్ ప్రైజ్ విజేత అరవింద్ అడిగా (Aravind Adiga) రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు, ప్రముఖ స్క్రీన్ రైటర్ సూని తారాపోరెవాలా స్క్రీన్ ప్లే అందించగా, జూహి చతుర్వేది సంభాషణలు రాశారు.
ఈ విడుదలైన టీజర్లో మనోజ్ బాజ్‌పేయి రిటైర్డ్ స్కూల్ టీచర్‌గా కనిపించారు. ఒక అపార్ట్మెంట్లో అందరూ ఖాళీ చేసి వెళ్లిపోగా అతడు మాత్రమే ఒంటరిగా జీవిస్తుంటాడు. అయితే ఒంటరిగా ఉంటున్న అతడి జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి ఈ సినిమా స్టోరి అని తెలుస్తుంది.