Manoj Bajpayee | థియేటర్లపై పెత్తనం చేస్తున్న పెద్ద సినిమాలు.. చిన్న చిత్రాలకు న్యాయం జరగడం లేదు: మనోజ్
Manoj Bajpayee | భారతీయ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాల హవా రోజురోజుకూ పెరుగుతున్న వేళ చిన్న బడ్జెట్, కంటెంట్ ఆధారిత చిత్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా థియేటర్లు దక్కకపోవడం వల్ల మంచి కథలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు చేరకముందే కనుమరుగవుతున్నాయి.
Manoj Bajpayee | భారతీయ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాల హవా రోజురోజుకూ పెరుగుతున్న వేళ చిన్న బడ్జెట్, కంటెంట్ ఆధారిత చిత్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా థియేటర్లు దక్కకపోవడం వల్ల మంచి కథలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు చేరకముందే కనుమరుగవుతున్నాయి. ఈ సమస్యపై జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారతీయ చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలకు సమాన అవకాశాలు కల్పించే వ్యవస్థ అత్యవసరమని అన్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు థియేటర్లను పూర్తిగా ఆక్రమించుకుంటున్నాయని, చిన్న సినిమాలకు సరైన స్క్రీన్లు, షోలు దక్కడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ సమస్య కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదని, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సీజన్లలో భారీ చిత్రాలు థియేటర్లన్నింటినీ దక్కించుకోవడంతో చిన్న సినిమాలు విడుదల వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. చిన్న సినిమాలకు కేవలం ప్రేక్షకుల మద్దతు సరిపోదని, ప్రభుత్వాలు కూడా వాటికి అండగా నిలవాలని మనోజ్ బాజ్‌పాయ్ సూచించారు. థియేటర్లలో కనీస సంఖ్యలో స్క్రీన్లు, షోలు కేటాయించే విధానాలను ప్రభుత్వం తీసుకురావాలని ఆయన కోరారు.చిన్న సినిమాలకు ఆర్థిక సహాయం అవసరం లేదు. కానీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు కనీస అవకాశాలు కావాలి. ప్రతి చిత్రానికి సమాన అవకాశాలు లభించేలా ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కల్పించాలి అని మనోజ్ స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠీ చిత్రాలకు కల్పిస్తున్న ప్రత్యేక రక్షణను ఆయన ఉదాహరణగా చూపించారు. స్థానిక మరాఠీ సినిమాలకు కొన్ని థియేటర్లు, ప్రైమ్ టైమ్ షోలు కేటాయించే విధానం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. ఇదే తరహా విధానం దేశవ్యాప్తంగా చిన్న, ప్రాంతీయ చిత్రాలకు అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద స్టూడియోలు, స్టార్ హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు తమ ప్రభావాన్ని ఉపయోగించి థియేటర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని మనోజ్ బాజ్‌పాయ్ ఆరోపించారు. భారీ సినిమాల ఒత్తిడి కారణంగా థియేటర్ యాజమాన్యాలు కూడా చిన్న చిత్రాలకు స్క్రీన్లు కేటాయించలేకపోతున్నాయని ఆయన అన్నారు. ఈ గుత్తాధిపత్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. సరైన నిబంధనలు, చట్టాలు అమల్లోకి వస్తేనే చిన్న సినిమాలు కూడా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

