Sirf Ek Bandaa Kaafi Hai | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు మనోజ్ బాజ్‌పేయి. ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం (Sirf Ek Bandaa Kaafi Hai). కోర్టు రూం డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించారు. మే 23న జీ5లో విడుదలైన ఈ మూవీ మంచి టాక్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
ఢిల్లీకి చెందిన 16 ఏండ్ల నూ సింగ్ అనే అమ్మాయి తనపై సూర్య మోహన్ కులశ్రేష్ఠ అనే బాబా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు బాబాను అరెస్ట్ చేస్తారు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ కేసును లాయర్ పూనమ్ చంద్ సోలంకి (మనోజ్ బాజ్‌పేయి) టేకప్ చేస్తాడు. ఈ కేసులో బాబాకు బెయిల్ రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో పూనమ్ చంద్ ప్రాణహాని కూడా ఉంటుంది.
పూనమ్ చంద్ కేసును పరిష్కరించే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో సాగే సినిమా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతూ సాగుతుంది. ఇంతకీ కేసును ఎలా పరిష్కరించాడన్నది సినిమాలో చూడాలి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీస్టూడియోస్-భానుషాలి స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
bandaa ట్రైలర్ ..