The Archies | ‘ది ఆర్చీస్’ నాకు నచ్చలేదు.. ఆ వార్తలు ఫేక్ అన్న మనోజ్ బాజ్పేయ్
The Archies Movie | బాలీవుడ్ స్టార్ వారసులు అరంగేట్రం చేసిన తాజా వెబ్ సిరీస్ ‘ది ఆర్చీస్’ (The Archies Movie). ఇందులో షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ (Suhana khan), శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Kushi kapoor), అమితాబ్ మనువడు అగస్త్య నంద (Agastya Nanda) ప్రధాన పాత్రల్లో నటించారు.
The Archies Movie | బాలీవుడ్ స్టార్ వారసులు అరంగేట్రం చేసిన తాజా చిత్రం ‘ది ఆర్చీస్’ (The Archies Movie). ఇందులో షారుఖ్ ఖాన్ గారాలపట్టి సుహానా ఖాన్ (Suhana khan), శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Kushi kapoor), అమితాబ్ మనువడు అగస్త్య నంద (Agastya Nanda) ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 07 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయ్ తనకు ‘ది ఆర్చీస్’ నచ్చలేదని చెప్పాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
నా కూతురితో కలిసి ‘ది ఆర్చీస్’ (The Archies) చూశా. నాకు నచ్చలేదు. తనకు కూడా నచ్చలేదని నా కుమార్తె చెప్పింది. ఈ సినిమా చూశాక.. అందులోని పాత్రల మాదిరిగా హిందీలో మాట్లాడమని నా కుమార్తెతో కాస్త గట్టిగా చెప్పా. దానికి తను.. మా కోసం నువ్వు అస్సలు సమయాన్ని కేటాయించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అని మనోజ్ తెలిపారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై మనోజ్ బాజ్పేయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ వార్తలు ఎవరు నమ్మకండి అవి ఫేక్ అంటూ వెల్లడించాడు. నేను ఎప్పుడు ఈ వ్యాఖ్యలు చేశానంటూ రాసిన పత్రికను సోషల్ మీడియాలో ట్యాగ్ చేశాడు.
इस तरह से कब बोला ? लगे रहो मुन्ना भाई 😀 clickbait ! https://t.co/NZPbQP46N1
— manoj bajpayee (@BajpayeeManoj) December 27, 2023
గల్లీ బాయ్, జిందగీ నా మిలేగీ దోబారా, లస్ట్ స్టోరీస్ చిత్రాల ఫేం బాలీవుడ్ స్టార్ దర్శకురాలు జోయా అక్తర్ (Zoya Akthar) ఈ సినిమాను డైరెక్ట్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

