‘ఇటీవల జరిగిన మా పెళ్లిలో నన్ను కొంతమంది లావుగా ఉన్నానని కామెంట్ చేశారు. గత కొంతకాలం నుంచి శరీరాకృతి విషయంలో ఎన్నో కామెంట్లను విన్నాను. అయితే మొదట్లో వాటి గురించి బాధపడ్డా. కానీ ఇప్పుడు ఫిట్‌గా, హ్యాపీగానే ఉన్నా. నాకు బరువు తగ్గాలనిపించినప్పుడు తప్పకుండా డైట్ మెయింటైన్ చేసి తగ్గుతాను’ అన్నారు నటి మంజిమా మోహన్. నటుడు గౌతమ్ కార్తీక్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడారు.
కెరీర్ గురించి మంజిమా స్పందిస్తూ ‘పెళ్లి తరువాత కూడా మంచి కథలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. నటిగానే నా కెరీర్‌ను కొనసాగించాలని అనుకుంటున్నాను. అయితే లాక్డౌన్ సమయంలో గౌతమ్, నేను సహజీవనంలో ఉన్నామనే వార్తలు కూడా అబద్దం. ఆ సమయంలో అప్పుడప్పుడు ఇద్దరం కలిసి బయటికి వెళ్లేవాళ్లం. అంతే తప్ప సహజీవనం చేయలేదు’ అని చెప్పింది.