సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘మండాడి’. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకుడు. వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ద్వారా సుహాస్ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడని, మత్స్యకారుల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇదని మేకర్స్ తెలిపారు.
రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశామని, యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాత: ఎల్రెడ్ కుమార్, దర్శకత్వం: మదిమారన్ పుగళేంది.