e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు

మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్ వేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. ఎన్నికల కోసం చాలా ఉత్సాహంగా ఉన్నానని, ఈ ఎన్నిక ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటమని ఆయన అన్నారు. ‘మా’ ఎన్నికల్లోకి రాజకీయాలు తీసుకురావద్దని చెప్పిన ఆయన పరోక్షంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. రెండు, మూడు రోజుల్లో తమ మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు.

- Advertisement -

ఈ ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం తమకు లేదని, తన మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ సహా అందరూ తనకే ఓటేస్తారని విష్ణు ధీమా వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారా? అని అడగ్గా పవన్ వ్యాఖ్యలపై మోహన్‌బాబు ఇప్పటికే స్పందించారని తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మోహన్‌బాబు మరింత వివరణ ఇస్తారని చెప్పారు. తాను సినిమా పరిశ్రమ పక్షాన ఉన్నానని, సినీపరిశ్రమపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించబోనని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రకాశ్‌రాజ్ కూడా సినీ పరిశ్రమ పక్షమా? లేక పవన్ పక్షమా? చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement