Bhatti Vikramarka | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu)తో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ప్రజా భవన్ చేరుకున్న మంచు విష్ణు భట్టి విక్రమార్క పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈ భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలు గురించి చర్చించారు. అనంతరం భట్టిని మంచు విష్ణు సన్మానించారు. ఇక ఈ భేటీలో మంచు విష్ణుతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు నటులు రఘుబాబు, శివ బాలాజీ కూడా పాల్గొన్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు @iVishnuManchu , @ActorSivabalaji, రఘు బాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు pic.twitter.com/YXVzz1pgxD
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) February 4, 2024