‘మా’ అధ్యక్ష బరిలో మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్లు హీరో మంచు విష్ణు ప్రకటించారు. గతకొంతకాలంగా ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు పోటీచేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆదివారం ఆయన ఈ వార్తలను ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదలచేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు ప్రత్యక్షంగా చూస్తూ పెరిగానని మంచు విష్ణు చెప్పారు. ‘మా’ కుటుంబసభ్యుల భావాలు, బాధలు తనకు బాగా తెలుసన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరుప్రతిష్టలు అందించిన తెలుగు సినీ పరిశ్రమకు మేమెంతో రుణపడి ఉన్నాము. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నా. ‘మా’ అసోసియేషన్‌కు నాన్న అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శనం అవుతాయని భావిస్తున్నా. అసోసియేషన్ వ్యవహారాలన్నింటినీ అతి దగ్గరగా పరిశీలించిన నాకు ‘మా కుటుంబసభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. ‘మా’ సభ్యుల్లో కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా, అందుబాటులో ఉంటాను. ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా నా సేవలను సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను’ అని ఆయన తెలిపారు. త్వరలోనే మంచు విష్ణు తన ప్యానల్‌ను ప్రకటించబోతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

