Manchu vishnu | ఆ విషయంలో మంచు విష్ణు సంచలన నిర్ణయం..?

Manchu vishnu | మంచు విష్ణు హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 19 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేండ్లలో ఈయనపేరు వినిపించిన దానికంటే .. గత నెల రోజులుగా మీడియాలో అంతకన్నా ఎక్కువ సార్లు వినిపించి ఉంటుంది. దానికి కారణం మా ఎన్నికలు ( MAA elections ). ఇన్ని రోజులు కేవలం సినిమాలతో బిజీగా ఉన్న మంచు విష్ణు.. తన దారి మార్చుకుని మా ఎలక్షన్స్ వైపు వచ్చాడు. అనుకున్నట్లుగానే ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై విజయం సాధించి మా అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. రాబోయే రెండేళ్లు పూర్తిగా మా అసోసియేషన్ కోసం తన సమయం కేటాయించబోతున్నట్టు ప్రకటించాడు విష్ణు.
ఎలాగైనా తాను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటానని.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్నాడు ఈయన. ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం ఇదొక్కటే అంటున్నాడు మంచు విష్ణు. అయితే ఇక్కడే మంచు అభిమానులకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇకపై విష్ణు సినిమాలు చేస్తాడా చేయడా అనేది అర్థం కావడం లేదు. నిజానికి చాలా కాలంగా విష్ణు వేగంగా సినిమాలు చేయడం లేదు. రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు అది కూడా చేసేలా కనిపించడం లేదు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా లేవు. మా అసోసియేషన్ కోసం రాబోయే రెండేళ్లు తన టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నాడు విష్ణు. ఇలాంటి సమయంలో సినిమాల కోసం డేట్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
సినిమాలు వదిలేసుకుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం వచ్చేశాడు మంచు విష్ణు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కచ్చితంగా మా సభ్యులకు సేవ చేస్తాను అంటున్నాడు. దాని కోసం అవసరమైతే సినిమాలు కూడా పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మంచు వారబ్బాయి. మరోవైపు మంచు విష్ణుకు నిరంతరం నీడలా నీ వెంటే ఉన్నాడు ఆయన తండ్రి మోహన్ బాబు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి.
శివ బాలాజీ భార్యపై సీరియస్ అయిన మోహన్ బాబు.. కారణమిదే..!
Pawan Kalyan : పవన్ వీడియో షేర్ చేసిన మంచు విష్ణు.. ఏ ప్రశ్న వేసాడో తెలుసా?
రాజీనామాలతో బెదిరించలేరు.. నాకు పనులున్నాయంటున్న మంచు విష్ణు..
చిరంజీవి చేతికి గాయం.. కంగారు పడుతున్న అభిమానులు..
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Pooja Hegde | పూజా హెగ్డే ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

