Manasa Varanasi | రహస్యాల సత్యభామ.. లవబుల్, మిస్టీరియస్ గర్ల్: మానస వారణాసి
“నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ఇక్కడే ఇంజనీరింగ్ చేశాను. కార్పొరేట్ జాబ్ కూడా చేశాను. తర్వాత మిస్ ఇండియా టైటిల్ గెలిచాను. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాను రిప్రజెంట్ చేశాను.
Manasa Varanasi | “నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ఇక్కడే ఇంజనీరింగ్ చేశాను. కార్పొరేట్ జాబ్ కూడా చేశాను. తర్వాత మిస్ ఇండియా టైటిల్ గెలిచాను. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాను రిప్రజెంట్ చేశాను. ఆ తర్వాత మూవీ వర్క్ షాప్‌కి వెళ్లాను. అక్కడే యాక్టింగ్‌పై ఇష్టం మొదలైంది. కాన్ఫిడెంట్ పెరిగింది. కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చాను. అలా ‘దేవకీనందన వాసుదేవ’లో హీరోయిన్గా ఎంపికయ్యాను. నా తెలుగు ఎంట్రీ ఇలాంటి మంచి సినిమాతో కావడం చాలా ఆనందంగా ఉంది’ అని మానస వారణాసి అన్నారు.
మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ సరసన ఆమె నటించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. దర్శకుడు ప్రశాంత్‌వర్మ కథతో, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఈ నెల 22న విడుదల కానుంది. మానస వారణాసి సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
‘ఇదొక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్. తొలి సినిమాకే ఇలాంటి కథ, క్యారెక్టర్ దొరకడం నిజంగా అదృష్టం. ఇందులో నా పాత్ర పేరు సత్యభామ. విజయనగరం అమ్మాయిని. లవబుల్, మిస్టీరియస్ గర్ల్. కథలో నాది చాలా బలమైన పాత్ర. ఛాలెంజ్‌గా తీసుకొని ఈ పాత్ర చేశాను. అశోక్ చాలా ప్రొఫెషనల్. అతనికి సినిమా అంటే పాషన్. సెట్స్‌లో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకునేవారు’ అని తెలిపింది. భీమ్స్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, బాలకృష్ణ సోమినేని చాలా పాషనేట్ ప్రొడ్యూసర్ అని మానస వారణాసి చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

