Manas: వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటానని చెప్పిన మానస్

బిగ్ బాస్ సీజన్ 5కి ఇది చివరి వారం కావడంతో ఫైనలిస్టుల జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించడానికి రెడీ అయ్యాడు. మొదటగా ఫస్ట్ ఫైనలిస్టు శ్రీరామ్‌ను సర్ప్రైజ్ చేశాడు. అనంతరం మానస్‌ని గార్డెన్ ఏరియాలోకి పిలిచి మానస్ వీడియో ప్లే చేశారు. ఇందులో అమ్మ ముద్దుల కొడుకుగా ఇంట్లో అడుగుపెట్టారు మానస్ అని చెప్పుకొచ్చారు. . ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు మీ ఓర్పు, అందరినీ అర్థం చేసుకునే తత్వం ఈ ఇంట్లో మీకు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాయి.
స్నేహం కోసం ఆఖరివరకు నిలబడ్డ తీరు ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. మనసు నొప్పించకుండా విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడం, అవసరమైతే గొంతెత్తి నిలదీయడం మీకే చెల్లింది. మనసు, తెలివి రెండింటినీ సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమం అని మెచ్చుకుంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు, స్వీట్ అండ్ సాడ్ మెమొరీస్ చూసి మానస్ కదిలిపోయాడు.
అనంతరం ఒక ఫొటోగ్రాప్ తీసుకెళ్లమంటే బిగ్‌బాస్‌ను అభ్యర్థించి రెండు ఫొటోలు పట్టుకెళ్లాడు. అమ్మతో దిగిన ఫొటోతో పాటు తన ఫ్రెండ్ సన్నీతో ఉన్న ఫొటోను జాగ్రత్తగా కాపాడుకుంటానన్నాడు. ఇది చూసిన శ్రీరామ్ తానూ కూడా రెండు తీసుకుంటే బాగుడేందేమోనని అనుకున్నాడు. ఇక ఈ రోజు సన్నీ, షణ్ముఖ్, సిరిల వీడియోలు ప్లే కానున్నాయి. వాటి కోసం చాలా ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

