BBTeluguGrandFinale | బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఇప్పుడిప్పుడే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్లలో సిరి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. టాప్ 5లో నెక్స్ట్ ఎలిమినేట్ అయింది మానస్. నాచురల్ స్టార్ నాని.. మానస్‌ను ఎలిమినేట్ చేశాడు.
బిగ్ బాస్ ఓ గేమ్ ప్లే చేయగా.. దాని ద్వారా మానస్ ఎలిమినేట్ అయిపోతాడు. అంతకుముందు నాని తన శ్యామ్‌సింగరాయ్ టీమ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తాడు. సాయిపల్లివి, కృతి శెట్టి కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి కాసేపు బిగ్ బాస్ ఫైనలిస్టులతో ముచ్చటిస్తారు.
అయితే.. మిగిలిన నలుగురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడు. నానితో ఒక సూట్‌కేస్ పంపిస్తాడు. ఆ సూట్‌కేస్‌లో బిగ్ ఎమౌంట్ ఉందని.. అది కావాలంటే ఎవరైనా తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవచ్చని చెబుతాడు నాని. కానీ.. ఎవ్వరూ సూట్‌కేస్ తీసుకోవడానికి ఒప్పుకోరు. ఆ తర్వాత బిగ్ బాస్ ప్లే చేసిన గేమ్ ద్వారా మానస్ ఎలిమినేట్ అయి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చేస్తాడు. ఇక మిగిలింది శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీ. ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ అవుతారో తెలియాలంటే ఇంకొంచెం సేపు ఆగాల్సిందే.