కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది
‘ఈ మధ్య వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్నానని అనిపించింది. మంచి ఎంటర్టైనర్స్ చేయమని అభిమానులు కోరేవారు. ఓ బ్యూటీఫుల్ పాయింట్‌తో ‘మనమే’ సినిమా చేశాం’ అన్నారు శర్వానంద్.
‘ఈ మధ్య వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్నానని అనిపించింది. మంచి ఎంటర్టైనర్స్ చేయమని అభిమానులు కోరేవారు. ఓ బ్యూటీఫుల్ పాయింట్‌తో ‘మనమే’ సినిమా చేశాం’ అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. మనిషికి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ టైమ్. దర్శకుడు ఈ పాయింట్‌ను అద్భుతంగా ఆవిష్కరించాడు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులు కొత్త ప్రపంచంలోకి వెళతారు. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలు కలబోసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
నా ఇరవైఏళ్ల సినీ ప్రయాణంలో 35 సినిమా చేశాను. ఈ జర్నీ ఎంతో సంతృప్తినిచ్చింది’ అన్నారు. ఈ సినిమాలో శర్వానంద్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచాడని, సక్సెస్‌మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, శర్వానంద్ తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లాడని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్‌లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

