‘ఆర్య’ ప్రేరణతో ఈ కథ రాశా!
‘లవ్ టుడే, డ్రాగన్ సినిమాల మాదిరిగానే ‘డ్యూడ్' కూడా మీకు నచ్చుతుంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తెలుగు సినిమాతో నాకు బాగా కనెక్ట్ అవ్వాలని ఉండేది. మైత్రీ మూవీస్ ద్వారా అది నెరవేరింది. దర్శకుడు కీర్తిశ్వరన్ మంచి సినిమా తీశారు. తను ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు. మమితా బైజు అద్భుతమైన ఎనర్జీతో నటించింది.
‘లవ్ టుడే, డ్రాగన్ సినిమాల మాదిరిగానే ‘డ్యూడ్’ కూడా మీకు నచ్చుతుంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తెలుగు సినిమాతో నాకు బాగా కనెక్ట్ అవ్వాలని ఉండేది. మైత్రీ మూవీస్ ద్వారా అది నెరవేరింది. దర్శకుడు కీర్తిశ్వరన్ మంచి సినిమా తీశారు. తను ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు. మమితా బైజు అద్భుతమైన ఎనర్జీతో నటించింది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది.’ అని హీరో ప్రదీప్ రంగనాథన్ అన్నారు. ఆయన, మమితాబైజు జంటగా నటించిన యువతరం సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడారు. డైరెక్టర్ కీర్తీశ్వరన్ మాట్లాడుతూ ‘ కథ రాసుకొని చెన్నై మొత్తం తిరిగాను. చివరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో నా సినిమా జర్నీ మొదలైంది.
మైత్రీ లాంటి గొప్ప సంస్థ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతానని కలలో కూడా అనుకోలేదు. హీరో ప్రదీప్ ఇందులో భిన్నంగా కనిపిస్తారు. మమితాబైజుది కూడా డిఫరెంట్ క్యారక్టర్. అల్లు అర్జున్ ‘ఆర్య’ని ప్రేరణగా తీసుకొని ఈ స్క్రిప్ట్ రాశాను. దీపావళికి సరైన సినిమా ఇది.’ అని నమ్మకంగా చెప్పారు. ఈ బ్యూటిఫుల్ లవ్స్టోరీలో స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని నిర్మాతలు రవిశంకర్, నవీన్ యర్నేని తెలిపారు. ఈ సినిమాలో నటించడం పట్ల కథానాయిక మమితా ఆనందం వెలిబుచ్చారు. దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన, సాయిరాజేశ్, రాహుల్ సంకృత్యాన్, శివ నిర్వాణ అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా డీవోపీ నిఖిత్ బొమ్మి, గీత రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీతం దర్శకుడు సాయి అభ్యంకర్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

