udhayanidhi stalin | ఇక పై సినిమాలు చేయను.. అదే నా ఆఖరి సినిమా :ఉదయనిధి స్టాలిన్
udhayanidhi stalin | తమిళనాడు సీఎం ఎమ్.కే స్టాలిన్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తమిళనాట తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న నటుడు ఉదయనిధి స్టాలిన్. ఓకే ఓకే, శ్రీనుగాడి లవ్‌స్టోరి, సైకో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘నెంజుకు నిధి’. బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘ఆర్టికల్15’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్లను జరుపుకుంటున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
ఉదయనిధి ఈ చిత్రం విడుదల కాకముందే మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో మామన్నన్ అనే సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఇదే ఏడాది ద్వితియార్థంలో రానుంది. అయితే నెంజుకు నిధి ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రం ఉదయనిధికి ఆఖరి చిత్రం అని తెలిపాడు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇక ఉదయనిధి తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kollywood
- udayanidistalin
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

