mallika sherawat : బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీలుగా కొంత కాలం వరకూ ఓ వెలుగు వెలిగిన తారల జాబితాలో మల్లికా షెరావత్ కూడా కచ్చితంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న జాకీ చాన్ చిత్రంలో కూడా ఈ భామ తళుక్కున మెరిసింది.
తాజాగా ‘ది లవ్ లాఫ్ లివ్ షో’లో ఈ బోల్డ్ బ్యూటీ పాల్గొంది. ఈ సందర్భంగా ఒకానొక సందర్భంలో తనకు ఒక ప్రొడ్యూసర్ చేసిన వింత సజెషన్‌ను బయటపెట్టింది. ఒక సినిమాలో మంచి హాట్ సాంగ్ చేస్తున్నారట. అప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ వచ్చి.. ‘నీలో వేడి ఉందని ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది? నీలో ఎంత వేడి ఉందంటే నీ నడుం మీద చపాతీలు వేసుకోవచ్చు’ అంటూ సీన్ వివరించాడట.
‘లేదు, మనం కచ్చితంగా అలాంటి పని చేయడం లేదు’ అని ఆమె ఆ ప్రొడ్యూసర్‌కు కరాఖండీగా చెప్పేసిందట. ఈ విషయం ఆమె చెప్పడంతో ప్రోగ్రాంలో పాల్గొన్న వారంతా నవ్వుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mallika Sherawat:తొలిసారి టాలీవుడ్లో అడుగుపెడుతున్న మల్లికా శెరావత్…!
Mallika Sherawat | తండ్రి పేరు చెప్పని మల్లికాశెరావత్..కారణమిదే..!
మల్లికాషెరావత్ హొయలు..నయా లుక్కు ఫిదా అవ్వాల్సిందే
Mallika Sherawat | అందుకే ఇండియా వదిలేసి వెళ్లిపోయాను : మల్లికాశెరావత్