NBK 107 | బాలకృష్ణ సినిమాలో మలయాళ బ్యూటీ?
Balakrishna | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌తో తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం నుంచి తరచూ ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా మలయాళ నటి హనీరోజ్ నటించనున్నట్లు సమాచారం. ‘ఆలయం’, ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి సినిమాలతో తెలుగులోనూ మెరిసిన ఈ తార బాలయ్య 107వ సినిమాలో రెండవ హీరోయిన్గా నటించనున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ‘అన్నగారు’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

