మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్ ‘వృషభ’ పేరుతో పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టారు. మలయాళం, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో అనువదించి విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రకటన వెలువడింది. తండ్రీ కొడుకుల సంఘర్షణ నేపథ్యంలో ప్రేమ, ప్రతీకారం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
వీఎఫ్ఎక్స్కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ తండ్రి పాత్రలో నటించనుండగా, మలయాళీ అగ్ర హీరో ఒకరు కొడుకు పాత్రలో నటిస్తారని సమాచారం. నందకిషోర్ ఈ చిత్రానికి దర్శకుడు.