మహా విషాదం.. గుండెపోటుతో కన్నుమూసిన లెజెండరీ దర్శకుడు..
కన్నుమూసిన లెజెండరీ దర్శకుడు | మలయాళ సినిమాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 50 సినిమాలకు పైగా కథలు అందించి అరడజను సినిమాలు తెరకెక్కించి రచయితగా, దర్శకుడిగా ఎనలేని సేవలు అందించిన లెజెండ్ డెన్నిస్ జోసెఫ్ మరణించారు.

సినిమా ఇండస్ట్రీలో విషాదాలకు అంతులేకుండా పోతోంది. ఒకటి మర్చిపోయే లోపు మరో రెండు మూడు వచ్చి మనసును బలంగా తాకుతున్నాయి. టాలీవుడ్ లో ప్రముఖ నటుడు జర్నలిస్టు టిఎన్ఆర్ మరణం జీర్ణించుకోక ముందే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ఈ సారి మలయాళ సినిమాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 50 సినిమాలకు పైగా కథలు అందించి అరడజను సినిమాలు తెరకెక్కించి రచయితగా, దర్శకుడిగా ఎనలేని సేవలు అందించిన లెజెండ్ డెన్నిస్ జోసెఫ్ మరణించారు. కొట్టాయం హాస్పిటల్లో గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మలయాళ సినిమాకు ఆయన అందించిన సేవలు ఎవరు మరచిపోలేరు.
మమ్ముట్టి, సురేష్ గోపి, మోహన్ లాల్ ఇలా ప్రతి ఒక్కరు స్టార్ హీరోతో పని చేశాడు డెన్నిస్ జోసెఫ్. ప్రతి ఒక్కరూ ఆయన కథలతో సినిమా చేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు కథలు మాటలు రాసిన లెజెండరీ స్క్రిప్ట్ రైటర్ ఈయన. 1985లో ఈరన్ సంధ్య సినిమాతో డెన్నిస్ ప్రయాణం మొదలైంది. 2021లో పవర్ స్టార్ సినిమా వరకు ఈయన ప్రస్థానం సాగింది. ఈ మధ్యలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు స్క్రిప్ట్ అందించారు జోసెఫ్.
ఈయన అందించిన కథతో వచ్చిన సినిమాలు మలయాళం సినిమా చరిత్రను తిరగరాసాయి. ఇంతటి అద్భుతమైన టెక్నీషియన్ మరణించడంతో మలయాళ సినిమా అనాధ అయిపోయింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా డేన్నిస్ జోసెఫ్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈయన మరణం తీరనిలోటు అంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

