Harish Pengan | కాలేయ వ్యాధితో ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ మళయాళ నటుడు హరీష్ పెంగన్ (49) (Harish Pengan) కాలేయ సమస్యలతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కడుపు నొప్పితో బాధపడుతుండటంతో పెంగన్ను ఈనెల ఆరంభంలో ఆస్పత్రిలో చేర్పించారు.
తిరువనంతపురం : ప్రముఖ మళయాళ నటుడు హరీష్ పెంగన్ (49) (Harish Pengan) కాలేయ సమస్యలతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కడుపు నొప్పితో బాధపడుతుండటంతో పెంగన్ను ఈనెల ఆరంభంలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు కాలేయ మార్పిడి అవసరమని వైద్యులు తెలిపారు.
పెంగన్ సోదరి అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చినా శస్త్ర చికిత్సకు అవసరమైన రూ .30 లక్షలు సమకూర్చుకోలేకపోయారు. నటుడి స్నేహితులు నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేయగా ఈలోగా పెంగన్ ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో మధ్యాహ్నం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.
మహెషింటే ప్రతీకారం, హనీ బీ 2.5, వెల్లారిపట్టణం, జానే మన్, జయ జయ జయ జయ హే, జో అండ్ జో, మిన్నల్ మురళి వంటి సినిమాల్లో పెంగన్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నటుడి అంత్యక్రియలను బుధవారం నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Read More
Buddy First Glimpse | టెడ్డీని టార్గెట్ చేసిన రౌడీ గ్యాంగ్.. అల్లు శిరీష్ బడ్డీ ఫస్ట్ గ్లింప్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

