casting couch | ఆడిషన్‌కు పిలిచి అసభ్యంగా తాకాడు : నటి మాళవిక శ్రీనాధ్ సంచలన ఆరోపణలు
మళయాళ నటి మాళవిక శ్రీనాధ్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ (casting couch )అనుభవాలను వెల్లడించింది.
న్యూఢిల్లీ : మళయాళ నటి మాళవిక శ్రీనాధ్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ (casting couch )అనుభవాలను వెల్లడించింది. మూడేండ్ల కిందట మంజు వారియర్ కూతురుగా నటించేందుకు తనను ఆడిషన్‌కు పిలిచారని, ఆడిషన్ ముగిసిన తర్వాత వీడియోను రికార్డు చేసిన వ్యక్తి తనను వెనుకనుంచి అసభ్యంగా తాకాడని ఆమె ఆరోపించారు.
తన తల్లి, సోదరి బయట వేచిచూస్తుండగా తనను పది నిమిషాల పాటు రూంలోపల వేచిఉండాలని కోరాడని మాళవిక శ్రీనాధ్ పేర్కొన్నారు. మళయాళం టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక శ్రీనాధ్ సంచలన ఆరోపణలు చేశారు. త్రిసూర్‌లో జరిగిన ఈ ఆడిషన్స్‌కు తల్లి, సోదరితో కలిసి వెళ్లానని ఆమె గుర్తుచేసుకున్నారు. తన జుట్టు సరిగా లేదని, డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి సరిచేసుకోవాలని అతడు చెప్పగా తాను రూంలోకి వెళ్లానని, ఆపై అతడు వెనుకనుంచి తనను పట్టుకున్నాడని ఆరోపించారు.
అతడు చాలా పొడవుగా, లావుగా ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు. అతడి ప్రవర్తనతో తాను వణికిపోయానని, నువ్వు సర్దుకుపోతే నువ్వు స్క్రీన్‌పై మంజు వారియర్ కూతురులా కనిపిస్తావని అతడు మభ్యపెట్టాడని తెలిపింది. ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని బయటపడ్డానని ఆమె గుర్తుచేసుకున్నారు. మాళవిక శ్రీనాధ్ మధురం, శాటర్డేనైట్ వంటి మళయాళం సినిమాల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

