Malavika Nair | నటిగా తాను ఎవరనేది తెలిపే సినిమా ఇది : మాళవిక నాయర్
Phalana Abbayi Phalana Ammayi Movie | ఎనిమిదేళ్ల క్రితం 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికా నాయర్. తొలిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆనంది పాత్రలో ఒదిగిపోయింది.
Phalana Abbayi Phalana Ammayi Movie | ఎనిమిదేళ్ల క్రితం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికా నాయర్. తొలిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆనంది పాత్రలో ఒదిగిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. అయితే మాళవిక వరుస సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. నిజానికి గతరెండు మూడు సినిమాల్లో మాళవిక సెకండ్ హీరోయిన్గా కూడా నటించింది. ప్రస్తుతం మాళవిక ఆశలన్ని ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాపైనే ఉన్నాయి. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించాడు.
ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చూడబోతున్నాం అనే ఫీలింగ్‌ను కలుగజేశాయి. కాగా ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ప్రమోషన్లో భాగంగా మాళవిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నటిగా తాను ఎవరనేది చూపించే చిత్రం ఇదని మాళవిక తెలిపింది. ఇప్పటివరకు నటిగా ఏం చేయాలో అంతవరకే చేశానని, కానీ ఇది తనకు దగ్గరైన సినిమా అని చెప్పుకొచ్చింది. 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఒక జంట ప్రేమ ప్రయాణం ఈ సినిమాలో చూపిస్తారని, ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్‌తో ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయని వెల్లడించింది.
ఏడేళ్ల తర్వాత శ్రీనివాస్ అవసరాల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టాడు. నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈసినిమా మార్చి 17న రిలీజ్ కానుంది. రోమ్ కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై టీ.జి విశ్వప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
Malvika Nair | ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ ఇంటర్వ్యూలో మాళవిక నాయర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

