మోడ్రన్ సత్యభామ
‘తమిళంలో ‘జో’ అనే సినిమా చేశాను. అందులో నా అభినయం చూసే ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే నేనూ ఓకే చెప్పాను. చాలా భిన్నమైన కథ ఇది. ఇందులో నా పాత్ర పేరు సత్యభామ.
‘తమిళంలో ‘జో’ అనే సినిమా చేశాను. అందులో నా అభినయం చూసే ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే నేనూ ఓకే చెప్పాను. చాలా భిన్నమైన కథ ఇది. ఇందులో నా పాత్ర పేరు సత్యభామ. మోడ్రెన్‌గా, హైపర్‌గా, యాటిట్యూడ్‌తో ఉండే పాత్ర.’ అని తెలిపారు కథానాయిక మాళవిక మనోజ్. సుహాస్‌కు జోడీగా ఆమె నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకుడు. హరీష్ నల్ల నిర్మాత. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో మాళవిక మనోజ్ విలేకరులతో ముచ్చటించారు.
‘నా రియల్లైఫ్కి ఏ మాత్రం కంపారిజన్ లేని పాత్ర ఇది. తెలుగు రాకపోయినా.. భావాన్ని అర్థం చేసుకొని నటించాను. టాలీవుడ్లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పనిచేసే వారిలో వృత్తి పట్ల నిబద్ధత ఎక్కువ. వారందరి సహకారం వల్లే ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించగలిగాను.’ అని చెప్పారు మాళవిక మనోజ్. హీరో సుహాస్ వెరీ నైస్ పర్సన్ అనీ, సెట్లో సినిమాకోసం మాత్రమే మాట్లాడతారని, ఈ సినిమాలో తమ కెమిస్ట్రీ బావుంటుందని, ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఫీల్ కొత్తగా ఉంటుందని మాళవిక మనోజ్ పేర్కొన్నారు. వైవిధ్యమైన పాత్రలతో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుందని, నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకుంటానని, కంఫర్ట్ జోన్లోనే సినిమాలు చేస్తానని మాళవిక మనోజ్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

