Viral videos | మాజీ భార్య మలైకా అరోరాను కౌగిలించుకున్న అర్బాజ్‌ఖాన్
Malaika Arora | బాలీవుడ్ నాయికానాయకులు మలైకా అరోరా, అర్బాజ్ఖాన్ల నడుమ చాన్నాళ్ల తర్వాత ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. 2017లో విడాకులు తీసుకున్న ఈ జంట కొడుకు అర్హాన్ఖాన్ను అమెరికాకు సాగనంపేందుకు విడివిడిగా ఎయిర్‌పోర్టుకు వచ్చి కలుసుకున్నారు.
ముంబై: బాలీవుడ్ నాయికానాయకులు మలైకా అరోరా, అర్బాజ్ఖాన్ల నడుమ చాన్నాళ్ల తర్వాత ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. 2017లో విడాకులు తీసుకున్న ఈ జంట కొడుకు అర్హాన్ఖాన్ను అమెరికాకు సాగనంపేందుకు విడివిడిగా ఎయిర్‌పోర్టుకు వచ్చి కలుసుకున్నారు. ఎయిర్‌పోర్టులో అర్హాన్‌ఖాన్ తల్లితో కాసేపు, తండ్రితో కాసేపు ముచ్చటించాడు. ముందుగా తల్లిని హగ్ చేసుకుని బాయ్ చెప్పి తండ్రి దగ్గరికి వచ్చాడు. తర్వాత తండ్రిని హగ్ చేసుకుని బాయ్ చెప్పి ఎయిర్‌పోర్టులో లోపలికి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత మాజీ భార్యభర్తలైన మలైకా అరోరా, అర్బాజ్‌ఖాన్ వెనుదిరిగి తమతమ కార్ల దగ్గరికి నడుస్తున్నారు. ఈ సందర్భంగా అర్బాజ్ ఖాన్.. మలైకా అరోరాను పలుకరించాడు. అతను ఏదో అడిగాడు, ఆమె ఏదో చెప్పింది. తర్వాత మలైకా కంటే ముందు నడుస్తున్న అర్బాజ్ ఆగిపోయి ఆమెవైపు తిరుగాడు. అమె కూడా అతనికి దగ్గరగా వచ్చింది. ఇద్దరూ హగ్ చేసుకుని బాయ్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఎవరి వాహనాల్లో వాళ్లు వెళ్లిపోయారు.
అయితే, ఐదేండ్ల క్రితం విడిపోయిన సెలెబ్రిటీ భార్యాభర్తలు చాన్నాళ్ల తర్వాత ఎదురుపడి కౌగించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. వేలమంది లైక్ చేస్తున్నారు. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ అరుదైన వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షిస్తారా..
#CelebWatch | Malaika Arora And Arbaaz Khan Share A Hug After Seeing Off Son Arhaan At Airport pic.twitter.com/c5Ll1UgoHw
— NDTV (@ndtv) January 27, 2023
#MalaikaArora #arbaazkhan snapped at airport together…. pic.twitter.com/yESGla9aiG
— CineHind (@CineHind) January 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

