Soorarai Pottru Remake | హిందీ రీమేక్‌పై పుకార్లు..నిర్మాణ సంస్థ క్లారిటీ..!
ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం (Soorarai Pottru) సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సుధాకొంగర ఈ చిత్రాన్నిబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara)-సూర్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం (Soorarai Pottru) సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా). ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం వివిధ విభాగాల్లో 5 నేషనల్ అవార్డులు అందుకుంది. ప్రస్తుతం సుధాకొంగర ఈ చిత్రాన్నిబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ గాసిప్స్‌పై అబండెన్షియా ఎంటర్టైన్మెంట్స్ టీం కొట్టి పారేసింది. సినిమా ప్రొడక్షన్ దశలో ఉందని, థియేటర్లలో మాత్రమే విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చింది. హిందీ వెర్షన్లో సూర్య గెస్ట్ రోల్లో కనిపించనున్నాడట.
అంతేకాదు ఈ చిత్రానికి హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పై కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడు. అపర్ణబాలమురళి పోషించిన పాత్రను రాధికా మధన్ పోషించనున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. మరి హిందీలో ఎన్ని అవార్డులు గెలుచుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

