Mahesh Babu Son | పాకిస్తాన్ పాపతో మహేష్ కొడుకు షికార్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్
Mahesh Babu Son | పహల్గాం ఉగ్రదాడిని భారతీయులు అంత ఈజీగా మరిచి పోలేకపోతున్నారు. పాకిస్తాన్‌కి తగిన బుద్ది చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ తాజాగా పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది
Mahesh Babu Son | పహల్గాం ఉగ్రదాడిని భారతీయులు అంత ఈజీగా మరిచి పోలేకపోతున్నారు. పాకిస్తాన్‌కి తగిన బుద్ది చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ తాజాగా పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ ఎయిర్లైన్లకు ఈ నిర్ణయం కొంత రుచించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బోర్డర్లో ఏ సమయం అయిన యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుందని కొందరు అంటున్నారు. ఇంత వివాదం జరుగుతున్న సమయంలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ పాకిస్తాన్ అమ్మాయితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుండడం హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటున్న గౌతమ్..అప్పుడప్పుడు వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తున్నాడు. ఆ మధ్య తన స్నేహితులతో కలిసి గౌతమ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. అది చూసి గౌతమ్‌లో కూడా మంచి టాలెంట్ ఉందని, తండ్రిని మించిన తనయుడు అవుతాడని కొందరు జోస్యాలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గౌతమ్ ఇండియన్ జెర్సీ ధరించి పాక్ జెర్సీ ధరించిన అమ్మాయితో షికార్లు వేస్తున్నాడు. ఇది ఒక షార్ట్ ఫిలిం అయిన అందులోని దృశ్యాలు, టీ షర్ట్‌పై ఉన్న పేర్లు వివాదం రాజేసేలా ఉన్నాయి. ఇది విద్యాభ్యాసంలో భాగంగా తీసిన వీడియో అని అంటున్నా, అందులోని సన్నివేశాలు వేడి పుట్టిస్తున్నాయి.
మహేష్ బాబు తన నటనతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న సమయంలో ఆయన తనయుడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు అభిమానులకి మింగుడుపడడం లేదు. గౌతమ్ ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో డ్రామా చదువుతున్నాడు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఎప్పటిదో అని, టీ షర్ట్‌పై ఉన్న పేర్లు కేవలం పాత్రల కోసమే ఉపయోగించారని, దీని వెనక మరే ఉద్దేశం ఉండి ఉండదు అని కొందరు అంటున్నారు. మరి ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యామిలీ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

