Mahesh Babu | ‘గాంధీ తాత చెట్టు’ సినిమాపై మహేశ్ బాబు ప్రశంసలు
Mahesh - Gandhi Thatha Chettu | అగ్ర దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu). ఈ సినిమా చూసిన మహేశ్ బాబు తాజాగా సినిమాతో పాటు సుకృతి వేణిపై ప్రశంసలు కురిపించారు.
Gandhi Tatha Chettu | అగ్ర దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu). ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటనకు గాను దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదా సాహెబ్ ఫాల్కే, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డు అందుకుంది. అయితే ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో పాటు సినిమా ప్రముఖలకు ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శించారు. అయితే ఈ సినిమా చూసిన మహేశ్ బాబు తాజాగా సినిమాతో పాటు సుకృతి వేణిపై ప్రశంసలు కురిపించారు.
గాంధీ తాత చెట్టు అనే చిత్రం ఎప్పుడు మీతోనే ఉంటుంది. అహింస అనే పదునైన థీమ్ ను దర్శకురాలు పద్మ మల్లాది ఎంతో అందంగా ప్రజెంట్ చేశారు. నా చిన్ని స్నేహితురాలు సుకృతి వేణి నటన చూసి చాలా గర్వపడుతున్నాను. నువ్వు నటిగా ఎదగడం, ఇంత శక్తివంతమైన నటనను ప్రదర్శించడం చూసి నాకు చాలా గర్వంగా ఉంది. . ఈ లిటిల్ మాస్టర్ పీస్ ను థియేటర్లలో మిస్ అవ్వకుండా చూడండి అంటూ మహేశ్ రాసుకోచ్చాడు.
#GandhiThathaChettu… This film will stay with you. ❤️ A poignant story about ahimsa beautifully brought to life by @padmamalladi14.
So incredibly proud of you my little friend #SukritiVeniBandireddi.. watching you grow into this beautiful actress and deliver such a powerful…
— Mahesh Babu (@urstrulyMahesh) January 23, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

