హీరో ప్రయాణం ఆరంభం

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మాత. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా టైటిల్ టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అగ్రహీరో మహేష్‌బాబు బుధవారం విడుదలచేశారు. ఈ టీజర్లో కౌబాయ్, జోకర్ గెటప్‌లలో అశోక్ గల్లా విభిన్నంగా కనిపిస్తున్నారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ‘అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తొలి సినిమా టైటిల్‌ను విడుదలచేయడం ఆనందంగా ఉంది. హీరో జర్నీ ఆరంభమైంది. టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. వినూత్నమైన పాయింట్‌తో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. జగపతిబాబు, నరేష్, కౌసల్య, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, రిచర్డ్‌ప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

