Mahesh Babu | జిమ్‌లో మహేష్ బాబు వర్కవుట్స్.. బెంబేలేత్తిస్తున్న లేటెస్ట్ లుక్
Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఫిట్నెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు మహేష్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన లేటెస్ట్ లుక్ ఒకటి బయటకొచ్చింది.
Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఫిట్నెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు మహేష్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన లేటెస్ట్ లుక్ ఒకటి బయటకొచ్చింది. స్టార్ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఇంకా ముహూర్తం కూడా సాగని ఈ సినిమాపై ఇప్పటికే వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. పైగా ఆర్ఆర్ఆర్ వంటి బంపర్ హిట్ తర్వాత జక్కన్న తెరెకెక్కిస్తున్న సినిమా కావడంతో యావత్ సినీ అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్ చెప్పి సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు నెలకొల్పాడు. పైగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమా అంటూ సోషల్ మీడియా హైప్‌తోనే మహేష్ అభిమానుల హార్ట్ బీట్ రెండు రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇక ఇప్పుడు రాజమౌళి రేంజ్ హాలీవుడ్‌కు ఎగబాకింది. ఆయన సినిమా కోసం మనమే కాదు మైల్ల దూరంలో ఉన్న పక్క దేశ సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇక మహేష్ సైతం ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాడట. మాములుగా ఇండస్ట్రీలో మహేష్‌ను చాలా సాఫ్ట్ అని.. ఎక్కువగా రిస్క్‌ల జోలికి వెళ్లడు అని అంటుంటారు. అయితే రాజమౌళి సినిమా కోసం కండలు పెంచుతూ, జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ నిత్యం కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన జిమ్ ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహేష్ గురువారం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు హార్డ్ వర్క్ విషయానికి వస్తే ఏదీ ఎప్పుడూ నలుపు & తెలుపు కాదు… దానిని తీర్చిదిద్దడం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోచ్చాడు.
దీనిపై పలువురు నెటిజన్లు మహేష్ యంగ్‌లుక్‌లో కనడటానికి రహస్యం ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు రాజమౌళి సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారా అని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారంతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

