బరోజ్ ఓ అద్భుత ఊహాజనిత ప్రపంచం
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ ‘బరోజ్ 3డి’. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ ‘బరోజ్ 3డి’. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా శనివారం మోహన్‌లాల్ విలేకరులతో ముచ్చటించారు.
‘బరోజ్’ ఓ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని యునిక్‌గా సినిమా చేశాం. అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్లా ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కూడా ఆసక్తిగా ఉంటుంది. ‘గార్డియన్ ఆఫ్ ది గామాస్ ట్రెజర్’ అనే నవల ఆధారంగా ఈ ఇమాజనరీ అడ్వెంచర్ కథను రూపొందించాం. నిధి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఓపెన్ మైండ్‌తో వచ్చి ఈ ఊహాజనిత ప్రపంచాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా
ప్రఖ్యాత హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. 12ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకు సాంగ్స్ కంపోజ్ చేశాడు. సంతోష్‌శివన్ కెమెరా విజువల్స్ సినిమాకు హైలైట్. గ్రాఫిక్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. యానిమేటెడ్ క్యారెక్టర్లను కూడా క్రియేట్ చేశాం. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం ఓ సవాల్. ఇది నాకు కొత్త అనుభూతినిచ్చింది. గత 40ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

