Oppenheimer | శృంగార సన్నివేశంలో భగవద్గీత పఠనాన్ని సమర్ధించిన మహాభారత్ నితీష్ భరద్వాజ్
క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్‌హైమర్ (Oppenheimer) మూవీలో హీరో శృంగార సన్నివేశంలో భగవద్గీత చదివే సీన్ వివాదాస్పదమైంది. ఈ సీన్‌పై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయిన ఫ్యాన్స్ హాట్ డిబేట్‌కు తెరలేపారు. ఈ వివాదంపై మహాభారత్ సీరియల్లో శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన నితీష్ భరధ్వాజ్ స్పందించారు.
ముంబై : క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్‌హైమర్ (Oppenheimer) మూవీలో హీరో శృంగార సన్నివేశంలో భగవద్గీత చదివే సీన్ వివాదాస్పదమైంది. ఈ సీన్‌పై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయిన ఫ్యాన్స్ హాట్ డిబేట్‌కు తెరలేపారు. ఈ వివాదంపై మహాభారత్ సీరియల్లో శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన నితీష్ భరధ్వాజ్ స్పందించారు.
ఈ ఓపెన్‌హైమర్ మూవీలోని వివాదాస్పద సీన్‌ను ఆయన సమర్ధించారు. ఓపెన్‌హైమర్ ఆటంబాంబును సృష్టించినప్పుడు జపాన్ జనాభాను చంపేందుకు ప్రయోగించినప్పుడు తాను తన విధిని సరిగ్గా నిర్వర్తించానా అని అతడు తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌హైమర్ కంటతడి పెట్టడం చూస్తే తన ఆవిష్కరణకు తాను చింతిస్తున్నట్టు వెల్లడైందని భరద్వాజ్ పేర్కొన్నారు. తన ఆవిషకరణ భవిష్యత్‌లో మానవజాతిని నాశనం చేస్తుందని అతడు పసిగట్టడంతో దానికి పశ్చాత్తాపపడ్డాడని చెప్పుకొచ్చారు.
సినిమాలో ఈ పద్యం వాడటాన్ని ఓపెన్‌హైమర్ మానసిక స్ధితి నుంచి కూడా అర్ధం చేసుకోవాలని అన్నారు. శాస్త్రవేత్త అనుక్షణం తానేం చేస్తున్నా తన ఆవిష్కరణ గురించే ఆలోచిస్తాడని, భౌతికంగా ఏం చేసినా అది సహజ యాంత్రిక చర్యలానే చేపడతాడని నితీష్ భరద్వాజ్ అన్నారు. ఓపెన్‌హైమర్ జీవితంలోని కీలక క్షణాల విషయంలోనూ ఈ భావోద్వేగ కోణం గురించి ఆలోచించాలని ప్రజలను కోరారు.
ఒక వ్యక్తిగా లేదా దేశంగా ఎలాంటి బాధ్యతలు లేకుండా ప్రాదేశిక, వాణిజ్య ఆధిపత్యం అనే దురాశతో ఇప్పుడు మనం మానవ జాతిని చంపేస్తున్న అన్ని పేలుడు సాంకేతికతలను చూస్తున్నామని అతడు నిరూపించాడు కదా అని నితీష్ భరద్వాజ్ ప్రశ్నించారు. ఇవాల్టి పరిస్థితి కురుక్షేత్రం మాదిరిగానే ఉందని, దీన్ని గుర్తెరిగిన బ్రాహ్మణులు, క్షత్రియులు స్పృహతో యుద్ధ నాదమైన ధనుర్వేదాన్ని ప్రచారం చేయలేదు. అణు నిరాయుధీకరణను ఐక్యరాజ్యసమితి కఠినంగా అమలు చేయాలని నోలన్ ఈ దిశగా విస్పష్ట సందేశం పంపారని చెప్పారు.
Read More :
Meghalaya | మేఘాలయా సీఎం సంగ్మా కార్యాలయంపై రాళ్ల దాడి.. గాయపడిన భద్రతా సిబ్బంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

