Viral Girl Monalisa | మళ్లీ పూసలు అమ్ముకోవాల్సిందేనా.. డైరెక్టర్ ప్రోడ్యూసర్కి గొడవ.. అయోమయంలో మోనాలిసా
Viral Girl | వైరల్ గర్ల్ మోనాలిసా మళ్లీ అయోమయంలో పడింది. తన వ్యాపారం దెబ్బతిన్న తర్వాత సినిమా ఛాన్స్ వచ్చిందనుకోని సంతోషపడేలోపు డైరెక్టర్ ప్రోడ్యూసర్కి గొడవ జరుగుతుండడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందా లేదా అనే డౌట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Maha Kumbh Viral Girl Monalisa | ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి వైరల్ అయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. అయితే తన వ్యాపారం బాగా జరుగుతుందనుకుంటే ఒక నెటిజన్ ఆమె ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో రాత్రికి రాత్రే వైరల్‌గా మారింది మోనాలిసా. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో కుంభమేళాకి వెళ్లిన వారు ఆమెతో ఫొటో దిగడానికి ఆసక్తిచూపించడం.. ఫొటోల పేరుతో ఆమెను ఎక్కడపడితే అక్కడ తాకడం వివాదానికి దారి తీసింది. దీంతో తన పూసల బిజినెస్ వదిలేసి తన గ్రామంకి వెళ్లిపోయింది. అయితే మోనాలిసాకి జరిగిన అన్యాయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెకి సపోర్ట్‌గా నిలిచారు. ఫేమస్ అనే పేరుతో అమె బ్రతుకుదెరువు మీద కొట్టారంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
ఇదిలావుంటే మోనాలిసా పరిస్థితి తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె చిత్రాలు చూసి హీరోయిన్గా అవకాశం ఇస్తానని తెలిపాడు. ఇప్పటికే మణిపూర్ నేపథ్యంలో రాబోతున్న ఒక మూవీకి సంతకం కూడా చేసింది మోనాలిసా. ఈ సినిమా కోసమే ప్రస్తుతం యాక్టింగ్ పై ట్రెయినింగ్ కూడా తీసుకుంటుంది మోనాలిసా. మరోవైపు మోనాలిసాకి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. అయితే సనోజ్ మిశ్రా .. మోనాలిసాతో క్లోజ్‌గా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. సనోజ్ మిశ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనోజ్ మోనాలిసాను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని, ఆమెను ట్రాప్ చేస్తున్నారని, తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదిలావుంటే తాజాగా ఈ వ్యాఖ్యలపై సనోజ్ మిశ్రా స్పందించారు. మోనాలిసా నా కూతురు లాంటిదని తెలిపాడు. ఆమె నా కూతురు వయసు ఉంటుంది. నేను ఆమెను వేధించట్లేదు. ఆమె ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తుంది. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమెను నేనే యాక్టింగ్ నేర్పిస్తున్నాను. ఇది తప్పుదోవ పట్టించడం కాదు. తనకి యాక్టింగ్ వచ్చింది అన్నప్పుడు సినిమా స్టార్ట్ చేస్తానని తెలిపాడు. మరోవైపు జితేంద్ర నారాయణ్‌పై కూడా విమర్శలు కూడా గుప్పించాడు. తన అబద్ధాలతో మొత్తం దేశాన్నే ట్రాప్ లోకి లాగుతున్నాడని మండిపడ్డారు. ఇక వీరిద్దరి గొడవతో ప్రాజెక్ట్ ఆగిపోతుందేమోనని భయపడుతుంది మోనాలిసా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

