Tollywood | ఆ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్.. కానీ కమర్షియల్‌గా..!
Tollywood | ఈ వారం అరడజన్ సినిమాలు వచ్చాయి. అన్నీ చిన్న సినిమాలే. అందులో కనీసం కొన్ని సినిమాల పేర్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. కానీ ప్రమోషన్స్‌తో థియేటర్స్ వరకు ప్రేక్షకులను రప్పించడానికి నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
Tollywood | ఈ వారం అరడజన్ సినిమాలు వచ్చాయి. అన్నీ చిన్న సినిమాలే. అందులో కనీసం కొన్ని సినిమాల పేర్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. కానీ ప్రమోషన్స్‌తో థియేటర్స్ వరకు ప్రేక్షకులను రప్పించడానికి నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ మ్యాడ్ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఈ సినిమాకు కాలేజ్ బ్యాచ్‌లు క్యూ కట్టడం ఖాయం అయిపోయింది. కాలేజ్ డ్రామానే అయినా కూడా ఎక్కడా ఏ బూతులు లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. మందు తాగడం మినహాయిస్తే మరేం చూపించలేదు.
మరోవైపు సిద్ధార్థ్ చిన్నా సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. అసలు సిద్దూ కెరీర్లోనే ఇది బెస్ట్ సినిమా అంటున్నారు విమర్శకులు. కానీ డబ్బులు వచ్చే మార్గం అయితే కనిపించలేదు. మరోవైపు మురళీధరన్ బయోపిక్ 800 సినిమాకు ఇదే పరిస్థితి. సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. చూసినోళ్లు కూడా బాగుందనే చెప్పారు. మురళీ జీవితాన్ని చాలా చక్కగా చూపించారనే ప్రశంసలు వచ్చాయి. అయితే కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమాకు ఓపెనింగ్స్ కనిపించడం లేదు.
ఇక కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర నటించిన మంత్ ఆఫ్ మధు సినిమాకు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి కానీ కమర్షియల్‌గా జాడ కనిపించడం లేదు. ఈ మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా దాన్ని కమర్షియల్‌గా కన్వర్ట్ చేసుకోవడంలో దర్శక నిర్మాతలు ఎంతవరకు విజయం సాధిస్తారనేది చూడాలిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

