గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘మా ఊరిపొలిమేర-2’. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆసక్తికరమైన కథ, కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. తప్పకుండా ఈ సినిమా జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. సాహితి దాసరి, రవివర్మ, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: గౌరు గణబాబు.