నాన్న గుర్తొస్తాడు
గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె హీరోగా నటిస్తున్న సినిమా ‘మా నాన్న నక్సలైట్’. అజయ్, సుబ్బరాజు, జీవ, ఎల్బీ శ్రీరామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలింస్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. 90వ దశకంలో సాగే కథతో ఈ సినిమా రూపొందింది. చిత్రాన్ని ఈ నెల 8న విడుదలకు చేస్తున్నట్లు తాజాగా జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘మనసుకు హత్తుకునే సినిమా ఇది. తండ్రీ కొడుకు మధ్య సాగే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. గతంలో ‘మాతృదేవోభవ’ సినిమా చూసినప్పుడు కలిగిన అనుభూతి ఈ చిత్రం చూసినప్పుడు కలిగింది. ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ఈ సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడికి వాళ్ల నాన్న గుర్తొస్తాడు. ఇది నేను మా నాన్నకు చేసే సెల్యూట్, కొడుక్కి ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా. మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది’ అని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కాశీ విశ్వనాథ్, రేలంగి నరసింహారావు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

