బ్యాంక్ ఉద్యోగి పాత్రలో
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్ ప్రారంభించిన దుల్కర్ సల్మాన్. పుష్కర కాలంగా తనదైన నటనతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. తన తదుపరి చిత్రం ‘లక్కీ భాస్కర్' ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్ ప్రారంభించిన దుల్కర్ సల్మాన్. పుష్కర కాలంగా తనదైన నటనతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. తన తదుపరి చిత్రం ‘లక్కీ భాస్కర్’ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. నటుడిగా దుల్కర్ సల్మాన్ 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘లక్కీ భాస్కర్’ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న లుక్‌లో దుల్కర్ కనిపిస్తున్నారు. 80ల కాలం నాటి బొంబాయి (ముంబయి) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ కలయికలో తెరకెక్కుతున్నందున భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

