Lucifer-2 Movie | జెట్ స్పీడ్‌లో లూసీఫర్-2 షూటింగ్.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది..!
Lucifer 2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal), మంజు వారియర్ (Manju Warrier), వివేక్ ఒబెరాయ్ (Vivek Oberai), టోవినో థామస్(Tovino Thomas), ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం లుసిఫర్ (Lucifer).
Lucifer 2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal), మంజు వారియర్ (Manju Warrier), వివేక్ ఒబెరాయ్ (Vivek Oberai), టోవినో థామస్(Tovino Thomas), ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం లుసిఫర్ (Lucifer). ఈ సినిమాకు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గాడ్ ఫాదర్ (God Father) పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు.
ఈ చిత్రానికి తని ఓరువన్ (Thani Oruvan) ఫేమ్ మోహన్ రాజా (Mohan Raaja) దర్శకత్వం వహించాడు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రం నుంచి సీక్వెల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. లుసిఫర్ 2 ఎంపురాన్ (Lucifer 2 Empuraan) అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండగా.. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇదే విషయాన్ని దర్శకుడు, నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ వెల్లడించాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఈ సీక్వెల్ పార్ట్‌లో పొలిటికల్ ఫీవర్‌ను మరింత చూపించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మురళి గోపి స్టోరీ అందిస్తున్నాడు. కాగా ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ మరింత స్టైలిష్‌గా కనిపించనున్నట్లు టాక్. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

