రాజేంద్రప్రసాద్, జయప్రద జంటగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ @ 65’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. డబ్భు నిండిన పెద్దాయన, 65 నిండిన పెద్దావిడ కాలనీ నుంచి పారిపోయిన ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది.
విచారణలో వారిద్దరూ ప్రేమించుకున్నారని, కలిసి బతకాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో వినోదంతోపాటు మనసుల్ని కదిలించే భావోద్వేగా సమ్మేళనంగా ఈ ట్రైలర్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. కార్తీక్‌రాజు, స్పందన, క్రిష్, నిహంత్రీరెడ్డి, నారాయణరావు, ప్రదీప్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈచిత్రానికి కథ: సుధీర్ చింటూ, మాటలు: లక్ష్మీభూపాల, కెమెరా: శ్యామ్ తుమ్మలపల్లి, సంగీతం: అనూప్‌రూబెన్స్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.