రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘లవ్ యూ రామ్’. డీవై చౌదరి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు దశరథ్, డీవై చౌదరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 30న విడుదలకానుంది. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘అందరికి నచ్చేలా కథ, కథనాలు ఉంటాయి. కుటుంబ భావోద్వేగాలు అందర్ని అలరిస్తాయి. మైత్రీ మూవీస్ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.