కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న చిత్రం వారసుడు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ రంజితమే (Ranjithame song) నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటకు చాలా మంది మ్యూజిక్ లవర్స్ డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇపుడు లవ్ టుడే హీరోయిన్ ఇవానా (Ivana) ఈ సాంగ్‌కు స్టెప్పులేసింది.
తన పార్ట్నర్స్ ఆజీద్ ఖాలీఖ్, నవీన్ కృభాకర్తో కలిసి ఇవానా స్టైలిష్‌గా డ్యాన్స్ చేసి నెటిజన్లు, ఫాలోవర్లు, మ్యూజికల్ లవర్స్ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటోంది. ఇపుడీ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్టయిన లవ్ టుడే ఇటీవలే తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాగా.. మంచి టాక్ తెచ్చుకుంటోంది.
ఈ సినిమా ఇవానాకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సెల్ఫిష్ చిత్రంలో ఇవానాను ఫీమేల్ లీడ్ రోల్‌కు ఫైనల్ చేశారని వార్తలు వస్తుండగా.. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. లవ్ టుడేను తెలుగులో విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు..ఈ సినిమాతో క్రేజ్ సంపాదించిన ఇవానాను ఆశిష్ రెడ్డి సినిమాకు రెఫర్ చేసినట్టు జోరుగా టాక్.
ఇవానా రంజితమే స్టైలిష్ డ్యాన్స్.. వీడియో