Love Today | క్రేజ్‌కు మూవీ లవర్స్ ఫిదా.. హిందీలో లవ్‌టుడే రీమేక్..?
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ప్రదీప్ రంగనాథన్ (pradeep ranganathan) స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ టుడే. ముందుగా తమిళ మాతృక భాషలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో సూపర్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకోవటానికి ఒక్క సినిమా చాలు.. అలాంటి సినిమానే ‘లవ్ టుడే’ (Love Today). తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ప్రదీప్ రంగనాథన్ (pradeep ranganathan) స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ టుడే. ముందుగా తమిళ మాతృక భాషలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో సూపర్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ మూవీని తెలుగులో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇనయ, ప్రదీప్ రంగనాథన్లను హీరోహీరోయిన్లుగా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర చేసింది లవ్‌టుడే. ఈ సూపర్ హిట్ యూత్‌ఫుల్ మూవీ ఇక నార్త్‌లో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతుందన్న వార్త ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ లవ్‌టుడే హిందీ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
ఇంతకీ హిందీ వెర్షన్లో ఏ హీరో కనిపిస్తాడనే కదా మీ డౌటు. యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వరుణ్ ధవన్‌తో లవ్ టుడే రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట బోనీకపూర్. అంతేకాదు వరుణ్ ధవన్ తండ్రి డేవిడ్ ధవన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. కాగా దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.

లవ్ టుడే చిత్రంలో ఇవానా ఫీ మేల్ లీడ్ రోల్లో పోషించగా.. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

