వయసుతో సంబంధంలేదు
ఇప్పుడైతే 90ఏళ్లు దాటిపోయి ఇలా ఉన్నాడుగానీ.. అప్పట్లో ధర్మేంద్ర అంటే ఆడవాళ్లల్లో చాలా క్రేజ్. వయసు రీత్యా సినిమాలు తగ్గించుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ధర్మేంద్ర ఇటీవలే సరదాగా ఓ సినిమాలో నటించారు.
ఇప్పుడైతే 90ఏళ్లు దాటిపోయి ఇలా ఉన్నాడుగానీ.. అప్పట్లో ధర్మేంద్ర అంటే ఆడవాళ్లల్లో చాలా క్రేజ్. వయసు రీత్యా సినిమాలు తగ్గించుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ధర్మేంద్ర ఇటీవలే సరదాగా ఓ సినిమాలో నటించారు. ఆ సినిమానే ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. చేయక చేయక ఒక సినిమా చేసి ప్రస్తుతం టాక్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయారు ధర్మేంద్ర. కారణం ఆ సినిమాలో ఈ వయసులో లిప్‌లాక్ చేయడమే. అదీ ఎవరితో ఒకనాటి తన సహనటి షబానా అజ్మీతో. ఆ సీన్లో ఈ ఇద్దరూ జీవించేశారట. దర్శకుడు కట్ చెప్పగానే.. లొకేషన్లో అందరికీ వినిపించేలా ‘బహుత్ మజా ఆయా’ అనేసి అందర్నీ తెగ నవ్వించేశారట ధర్మేంద్ర.
సినిమా విడుదలయ్యాక ఆడియన్స్ కూడా ఈ సీన్‌ని తెగ ఎంజాయ్ చేశారు. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మేంద్ర గారాలపట్టి ఈషాడియోల్ ఈ విషయం గురించి వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ తెరపై ముద్దు పెట్టుకోవడంలో తప్పేంటి? మా నాన్న రొమాంటిక్. కవితాత్మక హృదయంగల వ్యక్తి. అయినా ప్రేమకీ, ముద్దుకీ వయసుతో సంబంధంలేదు. షబానా అంటీ కూడా మోర్ రొమాంటిక్. ఇద్దరూ పాత్రకోసం ప్రాణం ఇచ్చేవారే. అందుకే ఇష్టంగా చేశారు. అందులో తప్పేముంది?’ అంటూ ఎదురు ప్రశ్నించి అక్కడున్నవారందర్నీ షాక్‌కి గురిచేశారట ఈషా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- Dharmendra
- Esha Deol
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

