‘ఓటీటీ మాధ్యమంతో ప్రేక్షకుల్ని మెప్పించడం సులభంకాదు. ప్రేక్షకులు కోరుకునే వినోదంతో పాటు వారిని ఉత్కంఠకు లోనుచేయడానికి ఎంతో శ్రమించాలి. ఆ అంశాలన్నీ ‘లూజర్-2’ ట్రైలర్లో కనిపిస్తున్నాయి’ అని అన్నారు నాగార్జున. ప్రియదర్శి, ధన్య బాలకృష్ణన్, కల్పికాగణేష్, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘లూజర్-2’. అభిలాష్‌రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. జీ5, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా సంస్థలు నిర్మించాయి. సోమవారం హైదరాబాద్‌లో ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ నెల 21 నుంచి జీ5లో విడుదలకానుంది. విభిన్నమైన కథ, కథనాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించామని దర్శకద్వయం తెలిపారు.