Javed Akhtar: సీతారాములే ఆదర్శ దంపతులు : జావెద్ అక్తర్
Javed Akhtar: సీతారాములే ఆదర్శ దంపతులు అని జావెద్ అక్తర్ అన్నారు. ప్రేమకు, వివాహ బంధానికి సీతారాములే నిదర్శమని, ఆదర్శ దంపతులు అని చెప్పడానికి ఆ జంటే ఉత్తమమైందని బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్ తెలిపారు. మతం, రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే జావెద్ అక్తర్.. సీతారాముల జంట గురించి అద్భుతమైన విషయాలను తెలిపారు.
ముంబై: ప్రేమకు, వివాహ బంధానికి సీతారాములే నిదర్శమని, ఆదర్శ దంపతులు అని చెప్పడానికి ఆ జంటే ఉత్తమమైందని బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్(Javed Akhtar) తెలిపారు. ముంబైలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా చీఫ్ రాజ్ థాకరే నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అక్తర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మతం, రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే జావెద్ అక్తర్.. సీతారాముల జంట గురించి అద్భుతమైన విషయాలను తెలిపారు.
ఎంతో మంది దేవుళ్లు ఉన్నారని, కానీ ఆదర్శవంతమైన భార్యాభర్తల గురించి చెప్పినప్పుడు, మన మెదళ్లలోకి సీతారాములే గుర్తుకు వస్తారని, ప్రేమ బంధానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏదీ లేదని అక్తర్ తెలిపారు. హిందూ మతంలో ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను ఆయన తెలిపారు. హిందువుల్లో సహనశక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. హిందువుల్లో కరుణ ఎక్కువ అని, పెద్ద మనసుతో వ్యవహరిస్తారని అన్నారు.
హిందూ మతమే ప్రజాస్వామ్య విలువల్ని నేర్పిందని, అందుకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందన్నారు. మనమే కరెక్టు, మిగితావాళ్లంతా తప్పు అన్న భావన హిందువుల్లో ఉండదన్నారు. రాముడు, సీత కేవలం దేవుళ్లు మాత్రమే కాదు అని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు అని జావెద్ అక్తర్ తెలిపారు.
#WATCH | Mumbai: Lyricist Javed Akhtar says, “There are many deities, but when we talk about the ideal husband and ideal wife, Ram and Sita come to mind… ‘Jai Siya Ram’ is the finest example of love and unity…” (09.11) pic.twitter.com/3q7ePovJCC
— ANI (@ANI) November 10, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

