భారీ ధరకు లైగర్ నాన్-థియేట్రికల్ హక్కులు..
Liger movie | రౌడిబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్.
Liger movie |రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహర్‌తో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. విజయ్‌కు జోడిగా అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది.ముంబైలోని ఒక ఛాయ్‌వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. తాజాగానే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈక్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత తిరిగి ట్రాక్ లోకి వచ్చిన పూరీ ఈ సినిమాకి దాదాపు రెండేళ్ళ సమయం తీసుకున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన అంతకంతకు అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి డిజిటల్ హక్కులకు భారీగా డీల్ కుదిరిందని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ అన్ని భాషలకు కలుపుకొని 60కోట్ల డీల్ కుదిరించుకుందని సమాచారం.
పాన్ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న లైగర్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఇదే కాంబోలో జనగణమన తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ను మొదలుపెట్టనుంది. పూరీ స్టైల్లో ఈ చిత్రాన్ని రెండు నెలల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసి ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

