ప్రముఖ బెంగాలీ దర్శకుడు బీడీ గుప్తా కన్నుమూత
బెంగాలీ దర్శకుడు బీడీ గుప్తా కన్నుమూత| బెంగాలీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత బుద్ధదేవ్ దాస్ గుప్తా (77) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన .....

న్యూఢిల్లీ: ప్రముఖ బెంగాలీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత బుద్ధదేవ్ దాస్ గుప్తా (77) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నారు. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే నుంచి ప్రేరణ పొందిన బుద్ధదేవ్ దాస్ గుప్తా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
ఆయనకు ‘బాగ్ బహదూర్’, ‘తహదర్ కథ’, ‘చరాచార్’, ‘ఉత్తర’ వంటి సినిమాలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. బుద్ధదేవ్ దాస్ గుప్తా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
‘బుద్ధదేవ్ దాస్గుప్తా మరణంతో చాలా బాధపడ్డాను. ఆయన వైవిధ్యభరిత రచనలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాలకు అద్ధం పడతాయి. ఆయన గొప్ప తత్వవేత్త, కవి’ అని ట్వీట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘ప్రముఖ చిత్రనిర్మాత బుద్ధదేవ్ దాస్గుప్తా మరణం విచారకరం. ఆయన తన రచనలతో తన సాహిత్యాన్ని సినీలోకానికి పరిచయం చేశారు. ఆయన మరణం సినీలోకానికి చాలా నష్టం. ఆయన కుటుంబానికి, సహచరులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

