Leo Movie | విజయ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా..? లియో సెకండ్ సింగిల్ టైం ఫిక్స్
Leo Second Single | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Leo Second Single | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా లాంఛ్ చేసిన రోజు నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వస్తుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి అభిమానులను నిరాశపరిచింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మూవీ నుంచి వరుసగా అప్డేట్లను ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్(Leo Second Single) కు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘లియో’ సెకండ్ సింగిల్ బాడాస్ (Badass) నేడు సాయంత్రం 6 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక సెకండ్ సింగిల్ కోసం అభిమానులు చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ సంభవం లోడింగ్.. అంటూ నెట్టింట #LeoSecondSingle ట్రెండింగ్ చేస్తున్నారు. మరోవైపు లియో నుంచి లాంఛ్ చేసిన నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
Mr. #LeoDas is a #Badass #LeoSecondSingle #BadassFromToday6PM#LEO 🔥🧊 pic.twitter.com/vk8e2RD1yr
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 27, 2023
లియో మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను మొదట మలేషియాలో నిర్వహిస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే విదేశాల్లో ఈ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు విజయ్ నిరాకరించాడు. దీంతో ఆ ఈవెంట్‌ను తమిళనాడులో సెప్టెంబర్ 30న నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియో తెలిపింది. అయితే దీనికోసం టికెట్స్, పాసులను ఏర్పాటు చేసింది. అయితే ఈ పాసులకు అనుకున్నదానికంటే ఎక్కువ డిమాండ్ ఏర్పడడంతో చేసేదేమీ లేక ఆడియో లాంచ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

