Leo Movie | విజయ్ ‘లియో’.. ఆ హాలీవుడ్ సినిమాకు రీమేకా.? వైరల్ అవుతున్న న్యూస్
Leo Movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేశ్- విజయ్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Leo Movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేశ్- విజయ్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీ స్టోరీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సైట్స్ లో ఈ సినిమాకు ఉన్న సినాప్సిస్ ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. లియో సినాప్సిస్, హాలీవుడ్ సినిమా ‘ఏ హిస్టరీ అఫ్ వైలెన్స్’ సినిమాను పోలివుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డేవిడ్ క్రోనెన్‌బర్గ్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ హిస్టరీ అఫ్ వైలెన్స్'(2005). ఈ మూవీని గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ఒక క్లాసిక్ గా చెబుతారు. ఈ సినిమా కథ సినాప్సిస్ విషయానికి వస్తే.. చాలా సౌమ్యుడైన హీరో స్థానికంగా ఓ రెస్టారెంట్ నడుపుతుంటాడు. ఐతే అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో అతనిలోని హింసాత్మక కోణం వెలుగుచూస్తుంది. దీని తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగతా కథ. ఇందులో హీరో గురించి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. హీరో ఓ అండర్ కవర్ గ్యాంగ్ స్టార్.
ఇప్పుడు ఇదే సినాప్సిస్ లియోలో బుకింగ్స్‌లో కూడా ఇచ్చారు. జాగ్రత్తగా గమనిస్తే.. పదాలు కూడా మార్చలేదు. దీంతో లియో హిస్టరీ అఫ్ వైలెన్స్కి అఫీషియల్ రిమేకా? అనే చర్చ మొదలైయింది. మరో విషయం ఏమిటంటే.. హిస్టరీ అఫ్ వైలెన్స్ సినిమా రిమేక్ రైట్స్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద వున్నాయట. ఆ కథలో కోర్ పాయింట్‌ని తీసుకొని లియో కథ సిద్ధం చేసారనే మాట కూడా వినిపిస్తోంది. మరి అసలు సంగతి ఏమిటనేది అక్టోబర్ 19న తెలియనుంది.
ఇక లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతోన్న లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

